logo

కోనసీమ ప్రభ.. హస్తినలో శోభ

కోనసీమ సంస్కృతి- సంప్రదాయాలకు ‘ప్రభ’ల నిదర్శనమైన ఉత్సవం ఈ సారి దిల్లీలో దర్శనమిచ్చింది. నారుమడితో ఉన్న వరిచేలు....పిల్లకాలువలు...ఎగువ కౌశికనదీ తీరాలను దాటించి తీసుకొచ్చే కోనసీమలోని సంక్రాంతి కనుమ ప్రభల ఉత్సవం ఇప్పుడు నదులను...నగరాలను దాటి దిల్లీ వీధుల్లో కనిపించడంతో కోనసీమ ప్రజలు పులకిస్తున్నారు.

Published : 27 Jan 2023 05:31 IST

దిల్లీ పరేడ్‌లో రాజసంగా సాగుతూ...

అంబాజీపేట: కోనసీమ సంస్కృతి- సంప్రదాయాలకు ‘ప్రభ’ల నిదర్శనమైన ఉత్సవం ఈ సారి దిల్లీలో దర్శనమిచ్చింది. నారుమడితో ఉన్న వరిచేలు....పిల్లకాలువలు...ఎగువ కౌశికనదీ తీరాలను దాటించి తీసుకొచ్చే కోనసీమలోని సంక్రాంతి కనుమ ప్రభల ఉత్సవం ఇప్పుడు నదులను...నగరాలను దాటి దిల్లీ వీధుల్లో కనిపించడంతో కోనసీమ ప్రజలు పులకిస్తున్నారు. నాలుగు శతాబ్దాలపైబడి చరిత్ర, ఆధ్యాత్మిక అనుబంధం ఈ ప్రభల ఉత్సవం ఇక్కడి ప్రజల సొంతం. అందుకే కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అంటే జిల్లావాసులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తెలుగువారికందరికీ ఇది పెద్దపండుగే. గణతంత్ర దినోత్సవం వేళ దిల్లీలో గురువారం కోనసీమ ప్రభల ఉత్సవ శకటం ప్రదర్శించిన తీరును టీవీలు,చరవాణుల్లో వీక్షించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆనంద ప్రభ...సంక్రాంతి ప్రభ...ఆధ్యాత్మిక ప్రభ అంటూ ప్రజలు నినదించారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచారు.


పవిత్రంగా భావిస్తాం..

కనుమ రోజున జరిగే ప్రభల ఉత్సవాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తాం..అలాంటి ప్రభల తీర్థానికి సంబంధించిన ప్రభల ఉత్సవం శకటం, కోనసీమ గరగనృత్యాలు దిల్లీలోని గణతంత్రవేడుకల్లో కనువిందు చేయడంతో సంతోషంగా ఉంది. గణతంత్రవేడుకలను టీవీల్లో చూసే సమయం వచ్చే వరకు ఉత్సుకతతో ఎదురుచూశాం.

మట్టపర్తి భారతి?


ఆధ్యాత్మిక భావంతోనే..

చరిత్ర కలిగిన ప్రభల తీర్థం పూర్తిగా ఆధ్యాత్మికభావంతోనే నిర్వహిస్తుంటాం.వందల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవ శకటాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించటం సంతోషం కలిగిస్తోంది. ఈ ప్రభల శకటాన్ని టీవీల్లో చూడగానే  ఏదో తెలియని అనుభూతి కలిగింది.

శ్రీపాద వెంకటరమణ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని