logo

‘పరీక్ష పే చర్చ’లో కరప గురుకుల విద్యార్థి

పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి, భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ మంచి ఫలితానిస్తోందని సమగ్ర శిక్ష ఏఎంవో ఎం.రామారెడ్డి తెలిపారు.

Published : 28 Jan 2023 03:05 IST

న్యూదిల్లీలో ప్రధాని మోదీతో ఇస్సాకు

కరప, న్యూస్‌టుడే: పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి, భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ మంచి ఫలితానిస్తోందని సమగ్ర శిక్ష ఏఎంవో ఎం.రామారెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కరపలోని మహాత్మా జ్యోతీబాఫులె వెనుకబడిన తరగతుల గురుకుల 10వ తరగతి విద్యార్థి టి.ఇస్సాకు హాజరై ప్రధానితో కలిసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికవగా ఇస్సాకు ఒకడని పాఠశాల ప్రిన్సిపల్‌ కె.వి.రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఎంఈవో బులి కృష్ణవేణి వీక్షించారు. ప్రతి విద్యార్థి నైపుణ్యాలను మెరుగుపరుచుకుని లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు