logo

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

జిల్లాలోని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Published : 28 Jan 2023 03:05 IST

సూచనలిస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలోని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక యూనిట్లలో ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. అమోనియా, క్లోరిన్‌, ఎల్‌పీజీ, బ్యుటెన్‌ వంటి మండే స్వభావం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. ఏటా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు. వచ్చేనెల 23న కాకినాడ తీరంలో ఉన్న కోరమాండల్‌ కంపెనీలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాధాకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సీఎస్‌ వీడియోకాన్ఫరెన్స్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి శుక్రవారం కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ కృతికాశుక్లా, అధికారులు హాజరయ్యారు. అంటువ్యాధులు కాని రోగాలపై ఇంటింటా సర్వే నిర్వహించి, గుర్తించాలన్నారు. దానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేయాలన్నారు. స్పందనకు వచ్చే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్‌ కృతికాశుక్లా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు