‘రాజ్యాధికారమే మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యం’
దళిత బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథం పిలుపు నిచ్చారు.
విశ్వనాథంను సత్కరిస్తున్న నాయకులు, కార్యకర్తలు
కాకినాడ నగరం, కలెక్టరేట్: దళిత బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథం పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాజన సోషలిస్టు పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ వల్లూరి సత్తిబాబు అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వనాథం మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ నేతృత్వంలో ఎంఎస్‌పీ ఏర్పాటు చేశారని, ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. మాల, మాదిగ, బీసీ, ఎస్టీ, మైనారిటీలను కలుపుకొని పెద్ద రాజకీయ పార్టీగా 2024లో ఎంఎస్‌పీ అవతరించనుందన్నారు. ఎస్సీల్లోని 58 ఉపకులాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్వనాథంను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, ముమ్మిడివరపు చిన సుబ్బారావు, కొత్తపల్లి రఘు, తాతపూడి వెంకటేశ్, సవరపు భైరవమూర్తి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
అల్లు అర్జున్తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
-
India News
Delhi Airport: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ
-
Crime News
Andhra News: అమర్తలూరు పోలీస్ స్టేషన్లో వైకాపా కార్యకర్తల వీరంగం