logo

ప్రకృతి వినాశనమే విపత్తుల హేతువు

ప్రకృతికి నష్టం వాటిల్లే  తప్పిదాలతోనే వాతావరణంలో వస్తున్న మార్పులు మానవాళికి హాని కల్గిస్తున్నాయని జాతీయ భూగర్భ జల వనరుల డెల్టా పరిశోధన విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యాజీరావు విశ్లేషించారు.

Published : 28 Jan 2023 03:05 IST

వాతావరణ మార్పులు- ప్రభావం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు

ఉద్యాన పరిశోధన కేంద్రం (అంబాజీపేట), న్యూస్‌టుడే: ప్రకృతికి నష్టం వాటిల్లే  తప్పిదాలతోనే వాతావరణంలో వస్తున్న మార్పులు మానవాళికి హాని కల్గిస్తున్నాయని జాతీయ భూగర్భ జల వనరుల డెల్టా పరిశోధన విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యాజీరావు విశ్లేషించారు. ప్రకృతికి విఘాతం కలిగే పంటల సాగుతో ఇప్పటికే భూగర్భజలాలు కలుషితమయ్యాయన్నారు. రక్షిత వ్యవసాయ విధానాలపై నాబార్డు అనుబంధ రంగాల వారికి అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం వర్క్‌షాపు (జ్ఞాన అంగడి)ను నిర్వహించారు. నాబార్డు డీడీఎం డాక్టర్‌ వై.ఎస్‌.నాయుడు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సత్యాజీరావు మాట్లాడారు. తీర ప్రాంతాల్లో రొయ్యల సాగు, అడవుల నరికివేత, కార్భన్‌  వ్యర్థాల పెరుగుదల తదితర కారణాలతో సముద్ర జలాల్లో లవణీయత పెరిగిపోతోందని ఆయన తెలిపారు. ప్రధానంగా డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలాల్లో ఎక్కువగా రొయ్యల సాగు వల్ల సముద్ర జలాలు కలుషితమవుతున్నాయన్నారు. కోనసీమ జిల్లాలోని 32 వేల హెక్టార్లలో ఉండే మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుండేవన్నారు. వాతావరణ మార్పులు-ప్రభావం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్‌ బి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త చలపతిరావు, శాస్త్రవేత్తలు గోవర్ధనరావు, కిరిటీ, నీరజ, మత్స్య, గ్రామీణాభివృద్ధి, సహకార బ్యాంకు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని