logo

నర్సింగ్‌ పరీక్షలో చూచిరాతలు?

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) పరీక్షల్లో చూచిరాతల బాగోతం కలకలం రేపుతోంది.

Published : 28 Jan 2023 03:05 IST

పరీక్ష కేంద్రం ఆవరణలో బుక్‌లెట్‌

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) పరీక్షల్లో చూచిరాతల బాగోతం కలకలం రేపుతోంది. ఆర్‌ఎంసీ ఆవరణలో బయట టెంట్లు వేసి ఈనెల 23 నుంచి జీఎన్‌ఎం పరీక్షలు రాయిస్తున్నారు. జీజీహెచ్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 52 కళాశాలలకు చెందిన మొదటి, ద్వితీయ, తృతీయ ఏడాది విద్యార్థులు సుమారు 5,560 మంది రాస్తున్నారు. వీరిని ఆరుబయట ప్రాంగణంలో టెంట్లలో కుర్చీల్లో పక్కపక్కనే ఇరుకుగా కూర్చోబెట్టారు. చూచిరాతలకు అవకాశం ఉందని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. తాజాగా సిబ్బంది తనిఖీల్లో బకెట్ల కొద్దీ స్లిప్‌లు దొరకడం, ప్రాంగణంలో ఇతరుల సంచారం చర్చనీయాంశమైంది. పరీక్ష రాసే ప్రాంగణంలో దొరికన స్లిప్‌లను పారిశుద్ధ్య సిబ్బంది బకెట్లలో ఏరి ఓకేచోట పోగేసిన చిత్రాలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.హేమలతాదేవిని వివరణ కోరగా మాస్‌ కాపీయింగ్‌ జరగలేదన్నారు.పరీక్షకు ముందు, తరువాత విద్యార్థులను తనిఖీలు చేసి.. వారివద్ద ఏమైనా స్లిప్‌లు ఉంటే వాటిని సిబ్బందితో కలిసి బకెట్లతో సేకరించారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదన్నారు.

 న్యూస్‌టుడే, కాకినాడ(మసీదుసెంటర్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని