logo

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.27 కోట్లు

అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం నెల రోజులకు రూ.1.27 కోట్లు సమకూరింది. ఛైర్మన్‌ రోహిత్‌, ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి సమక్షంలో శుక్రవారం హుండీలను తెరచి సొమ్ము లెక్కించారు.

Published : 28 Jan 2023 03:05 IST

కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం నెల రోజులకు రూ.1.27 కోట్లు సమకూరింది. ఛైర్మన్‌ రోహిత్‌, ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి సమక్షంలో శుక్రవారం హుండీలను తెరచి సొమ్ము లెక్కించారు. రూ.1,22,70,187 నగదు, రూ. 4,57,683 చిల్లర నాణేలు మొత్తం రూ.1,27,27,870 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. 62 గ్రాముల బంగారం, 534 గ్రాముల వెండి, సింగపూర్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇంగ్లండ్‌, కెనడా తదితర దేశాల కరెన్సీ సమకూరిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని