logo

ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలోని మహిళలు, చిన్నారులు, గర్భిణులకు ఆరోగ్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు వెలగపూడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పలు అంశాలపై శుక్రవారం దూరదృశ్య సమావేశం నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తోపాటు జేసీ తేజ్‌భరత్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Published : 28 Jan 2023 03:05 IST

సమావేశంలో కలెక్టర్‌, జేసీ, ఇతర అధికారులు

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలోని మహిళలు, చిన్నారులు, గర్భిణులకు ఆరోగ్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు వెలగపూడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పలు అంశాలపై శుక్రవారం దూరదృశ్య సమావేశం నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తోపాటు జేసీ తేజ్‌భరత్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్‌జీటీ లక్ష్యాలు, సూచికలు, నైపుణ్యాభివృద్ధి, సచివాలయ సేవలు జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఇతర సేవల గురించి ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరించారు. పెన్షన్‌ కానుకకు సంబంధించి గతవారం 241 ఫిర్యాదులు రాగా వాటిలో 122 పరిష్కరించామని, మిగిలినవి పరిశీలన దశలో ఉన్నాయన్నారు. ఇళ్ల స్థలాలకు 58, బియ్యం కార్డులకు 1,037 దరఖాస్తులు రాగా వీటిలో 512 పరిష్కరించామని, సమీకృత ధ్రువపత్రాల కోసం 2,032 దరఖాస్తులకు 648 పరిష్కరించగా మిగతావి పరిశీలనలో ఉన్నాయని వివరించారు.

నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు

నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్య కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఉన్న న్యాక్‌లో స్కిల్‌ కళాశాల, జిల్లాలో నియోజకవర్గానికొక స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. వీటిలో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌లలో వివిధ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు రాజమహేంద్రం అర్బన్‌- 91339 12947, గ్రామీణం - 90636 48365, రాజానగరం- 99599 67534, కొవ్వూరు- 73062 32373, అనపర్తి- 95508 82754, గోపాలపురం 84999 43366, నిడదవోలు- 96760 52454 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని