logo

సత్రం భూమిలో అక్రమ కట్టడం తొలగింపు

కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలో సర్వే నెంబర్‌ 35/1లో సుమారు రూ.10 కోట్ల విలువైన బొగ్గవరపు సత్రానికి చెందిన ఎకరం భూమిలో ఆక్రమణలను దేవాదాయ శాఖ అధికారులు ఆదివారం తొలగించారు.

Published : 30 Jan 2023 05:31 IST

జిల్లా దేవాదాయ శాఖ అధికారి నారాయణమూర్తి, ఇతర అధికారులతో ఎమ్మెల్యే కన్నబాబు

సర్పవరం (సర్పవరం జంక్షన్‌), న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలో సర్వే నెంబర్‌ 35/1లో సుమారు రూ.10 కోట్ల విలువైన బొగ్గవరపు సత్రానికి చెందిన ఎకరం భూమిలో ఆక్రమణలను దేవాదాయ శాఖ అధికారులు ఆదివారం తొలగించారు. కొందరు భూమిని కబ్జా చేసి అక్రమంగా రేకుల గోడ నిర్మించడంపై ‘సత్రం భూములు కబ్జా’ శీర్షికన ఆదివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్పందించారు. ఆదివారం తన కార్యాలయంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి పులి నారాయణమూర్తి, సత్రం ఈవో శివబాబు, సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ, దేవాదాయ శాఖ ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులతో సమీక్షించారు. సాయంత్రం సర్పవరం గ్రామంలోని బొగ్గవరపు సత్రం భూమిలో రేకుల గోడను యంత్రాలతో కూల్చివేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భావనారాయణస్వామికి చెందిన మేడలైనులో భూములకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో కొన్ని రికార్డులు సృష్టించారని, ఇది జేసీ కోర్టులో ఉందన్నారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి పులి నారాయణమూర్తి మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆస్తుల ఆక్రమణలపై నివేదిక తయారు చేస్తున్నామని, తొలగింపునకు త్వరలో కార్యాచరణకు దిగుతామన్నారు. దేవాదాయ శాఖ పరిపాలనాధికారులు కె.నాగేశ్వరరావు, సోమరాజు, ఇన్‌స్పెక్టర్‌ ఫణీంద్రకుమార్‌,, డిప్యూటీ తహసీల్దారు కృష్ణకుమారి, సర్వేయర్‌ ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

సర్పవరంలో బొగ్గవరపు సత్రం భూమిలో ఆక్రమణల తొలగింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని