logo

మూడు నెలల్లో ఏడు మాతృమరణాలు

జిల్లాలో గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడు నెలల వ్యవధిలో ఏడు మాతృమరణాలు సంభవించాయి.

Published : 01 Feb 2023 04:21 IST

వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడు నెలల వ్యవధిలో ఏడు మాతృ మరణాలు సంభవించాయి. దీనిని జిల్లా ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో కలెక్టర్‌ మాధవీలత  సమావేశం నిర్వహించారు. సరైన పర్యవేక్షణ ఉన్నప్పుడే మాతృమరణాలను నివారించగలమన్నారు. గర్భిణిగా నమోదు అయినప్పట్నుంచి  నిర్వహించే పరీక్షల వివరాలు ఎంసీపీ కార్డులో పొందుపరిస్తే, తద్వారా తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. ప్రతి గర్భిణికి వైద్యులతో పరీక్షలు చేయించాల్సిన బాధ్యత ఆశ కార్యకర్తలు, క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదకరస్థితిలో ఉన్న గర్భిణుల విషయంలో డెలివరీ తేదీకి పదిరోజుల ముందుగానే రిఫరల్‌ ఆసుపత్రులకు తరలించాలన్నారు. రక్తం ఏడు గ్రాముల కంటే తక్కువ ఉన్నవారికి ముందు నుంచే ఐరన్‌ మాత్రలు అందించాలని, సమతుల్య ఆహారం తీసుకునేందుకు అంగన్‌వాడీ సేవలను వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని