logo

విభేదాలొద్దు.. సమష్టిగా పనిచేయండి

తెదేపాలో అంతర్గత విభేదాలు లేకుండా అందరూ సమష్టిగా పని చేయాలని పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడు యర్రా వేణుగోపాలరాయుడు కోరారు.

Published : 01 Feb 2023 04:21 IST

మాట్లాడుతున్న యర్రా వేణుగోపాలరాయుడు

పి.గన్నవరం: తెదేపాలో అంతర్గత విభేదాలు లేకుండా అందరూ సమష్టిగా పని చేయాలని పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడు యర్రా వేణుగోపాలరాయుడు కోరారు. పి.గన్నవరం మండల తెదేపా అధ్యక్షుడి విషయంలో ఇటీవల తలెత్తిన విభేదాల నేపథ్యంలో మంగళవారం పి.గన్నవరంలో గ్రామస్థాయి అధ్యక్ష,కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు.రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.వర్గవిభేదాలు విడనాడాలని సూచించారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన సమావేశం చంద్రబాబు సమక్షలో పి.గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ సమావేశంలో పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. అనంతరం గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులతో వేణుగోపాలరాయుడు ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు సేకరించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు డొక్కా జగన్నాదం, కిషోర్‌, ఎంపీపీ అంబటి భూలక్ష్మి, సర్పంచులు కుంపట్ల నాగలక్ష్మి, బొండాడ నాగమణి, తెదేపా కార్యదర్శి పెచ్చెట్టి పెద్ద తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని