logo

పాఠశాలల పర్యవేక్షణలో సీఆర్‌పీలు కీలకం

పాఠశాలల పర్యవేక్షణలో సీఆర్‌పీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.వి.రవిసాగర్‌ సూచించారు.

Published : 01 Feb 2023 04:21 IST

మాట్లాడుతున్న డీఈఓ రవిసాగర్‌

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: పాఠశాలల పర్యవేక్షణలో సీఆర్‌పీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.వి.రవిసాగర్‌ సూచించారు. ముమ్మిడివరంలోని మండల వనరుల కేంద్రంలో జిల్లాస్థాయిలో సీఆర్‌పీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి డీఈఓ అధ్యక్షత వహించి మాట్లాడారు. మండలాలవారీగా సీఆర్‌పీలు క్షేత్రస్థాయిలో చేసిన పర్యటనలు, తనిఖీ రిపోర్టు ఆధారంగా సమీక్ష నిర్వహించి, పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. జాబ్‌ఛార్టు ప్రకారం సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ అమలుచేసే కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేసేలా పాఠశాలల తనిఖీలు ఉండాలని సీఆర్‌పీలకు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, జేవీకే పంపిణీ, ‘నాడు-నేడు’ పనులు తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారి సమీక్షించారు. ముమ్మిడివరం మండల విద్యాశాఖాధికారి బి.రమణశ్రీ మాట్లాడుతూ క్లస్టర్‌ స్థాయిలో సెన్సెస్‌ రిజిస్టరు నిర్వహిస్తూ.. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పి.రాంబాబు మాట్లాడుతూ సీఆర్‌పీలు ఎప్పటికప్పుడు పాఠశాలల్లో పరిశీలించిన అంశాలను మండల విద్యాశాఖాధికారి, క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష కార్యాలయానికి తెలియజేయాలన్నారు. సమావేశంలో కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏపీఓ ఎంఏకే భీమారావు, జి.ప్రవీణ్‌కుమార్‌, మెయినుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని