logo

నాడు పేదల ఆకలి తీర్చి.. నేడు సచివాలయంగా మార్చి

గత ప్రభుత్వ హయాంలో తుని పట్టణంలో రోజూ వేల మంది ఆకలి తీర్చిన ‘అన్న క్యాంటీన్‌’ భవనం ఇకపై వార్డు సచివాలయంగా మారనుంది.

Published : 01 Feb 2023 04:21 IST

న్యూస్‌టుడే - తుని: గత ప్రభుత్వ హయాంలో తుని పట్టణంలో రోజూ వేల మంది ఆకలి తీర్చిన ‘అన్న క్యాంటీన్‌’ భవనం ఇకపై వార్డు సచివాలయంగా మారనుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు కారణాలతో అన్న క్యాంటీన్లను మూసివేసిన సంగతి విదితమే. ఆ తర్వాత ఈ భవనంపై రాళ్లదాడి జరగ్గా అద్దాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి సైతం చోరీకి గురైంది. నిరుపయోగంగా వదిలేసిన ఈ భవనానికి సుమారు రూ.4.60 లక్షలు వెచ్చించి పాలనా కార్యాలయంగా మార్చారు. త్వరలో 14వ వార్డు సచివాలయంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇటీవలే పురపాలక సంఘం కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని