logo

ఎంపీ ఔనన్నారు.. మంత్రి కాదన్నారు..

కాకినాడలోని రామ్‌కోస భవనం పక్కన రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) మైదానంలో వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో మెన్స్‌ వసతి గృహ భవన నిర్మాణానికి సంబంధించి సోమవారం (గత నెల 30న) జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం నిలిచిపోయింది.

Published : 01 Feb 2023 04:21 IST

శంకుస్థాపనకు నిర్మించిన దిమ్మె

మసీదు సెంటర్‌ (కాకినాడ): కాకినాడలోని రామ్‌కోస భవనం పక్కన రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) మైదానంలో వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో మెన్స్‌ వసతి గృహ భవన నిర్మాణానికి సంబంధించి సోమవారం (గత నెల 30న) జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం నిలిచిపోయింది. ముందుగా కాకినాడ ఎంపీ వంగా గీతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. చివరి నిమిషంలో విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విడదల రజని, తన పరిధిలోని కార్యక్రమాన్ని ఎవరో చేయడంపై అభ్యంతరం చెప్పడంతో శంకుస్థాపన నిలిపివేశారు. ఇద్దరి ప్రజాప్రతినిధుల మధ్య వివాదంలో ఆర్‌ఎంసీ వైద్య సిబ్బంది నలిగిపోతున్నట్లు సమాచారం. ఎవరి మాటా కాదనలేని పరిస్థితి వారికి తలెత్తింది. దాంతో మంత్రితోే ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు మరో ముహూర్తాన్ని ఖరారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. దీనిపై ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నర్సింహంను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. వైద్య శాఖ మంత్రి రజని శంకుస్థాపనకు హాజరవుతానని చెప్పడంతోనే వాయిదా వేశామన్నారు. మిగిలిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని