logo

ఆర్జన.. అనాథలకు అంకితం

పుడుతూనే తెచ్చేది లేదు. చనిపోయాక పట్టుకుపోయేది ఉండదు. నడుమ సంపద మనది కాదనే ఉన్నతాశయంతో పేదల సేవకు అందించాలనేది ఆయన కోరిక.

Published : 01 Feb 2023 04:21 IST

తాళ్లరేవులో నిర్మించిన భవనం

న్యూస్‌టుడే, తాళ్లరేవు: పుడుతూనే తెచ్చేది లేదు. చనిపోయాక పట్టుకుపోయేది ఉండదు. నడుమ సంపద మనది కాదనే ఉన్నతాశయంతో పేదల సేవకు అందించాలనేది ఆయన కోరిక. అందుకోసమే పెళ్లి చేసుకోలేదు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం రత్సావారిపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి(మోకానికల్‌ ఇంజినీర్‌) 75 ఏళ్ల రత్సా రామారావు. తనకున్న 10 సెంట్ల స్థలంలో రూ.80లక్షలతో నూతన భవనం(కల్యాణ మండపం) నిర్మించారు. కరప మండలం గొర్రిపూడిలో మూడు ఎకరాల భూమి ద్వారా వచ్చే అదాయాన్ని అనాథ పిల్లల చదువులు, భోజన వసతి, పేదల పెళ్లిళ్లకు కల్యాణ మండపం నిర్వహణకోసం కేటాయించారు. తాను సంపాదించిన యావదాస్తిని కొత్త కోరింగ దుర్గామల్లేశ్వర బాలల, వృద్ధుల ఆశ్రమానికి వీలునామా రాసిచ్చినట్లు రామారావు మంగళవారం తెలిపారు. పేదరికంలో పుట్టా. ఒంటరిగా ఉంటూ ఎన్నో కష్టాలు అనుభవించా. కాకినాడలో రావు బహుదూర్‌ పైడా వెంకటచలపతి చౌట్రీ, ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ వసతిగృహాల్లో పెట్టిన భోజనంతో అకలి తీర్చుకున్నా. కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా పూర్తిచేశా. రాజమహేంద్రవరం పేపరు మిల్లులో మెకానికల్‌ ఇంజినీర్‌గా పని చేశా. తాళ్లరేవులో నిర్మించిన కల్యాణ మండపంలో పేద కుటుంబాలవారు వివాహాలు చేసుకుని సంతోషంగా ఉండాలనేది కోరిక. భవనం నిర్వహణ బాధ్యతను ఆశ్రమం నిర్వాహకుడికి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

రత్సా రామారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని