logo

ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసు

గోదావరిలో దూకేందుకు సిద్ధమైన ఓ వ్యక్తిని ఎస్సై కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మండా సుభాష్‌ చంద్రబోస్‌ వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు.

Published : 01 Feb 2023 04:21 IST

చంద్రబోస్‌ను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఎస్సై దుర్గాప్రసాద్‌

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: గోదావరిలో దూకేందుకు సిద్ధమైన ఓ వ్యక్తిని ఎస్సై కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మండా సుభాష్‌ చంద్రబోస్‌ వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు. మంగళవారం కొవ్వూరు రోడ్‌కం రైలు వంతెనపైకి వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 144వ స్తంభం వద్ద రెయిలింగ్‌ ఎక్కారు. అదే సమయానికి ఎస్సై దుర్గాప్రసాద్‌ రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వస్తున్నారు. చంద్రబోస్‌ను గమనించి ఆగారు. పోలీసులను చూస్తే కంగారుపడి బాధితుడు దూకేసే అవకాశం ఉందని చాకచక్యంగా చంద్రబోస్‌ దగ్గరకు వెళ్లి అతణ్ని కిందకు దింపారు. స్టేషన్‌కు తీసుకొచ్చి, కౌన్సెలింగ్‌ చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. ఎస్సై, ఆయన వెంట ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ ఏడుకొండలును సీఐ రవికుమార్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని