logo

శివరాత్రి ఉత్సవాలు సమన్వయంతో నిర్వహిద్దాం

సామర్లకోట భీమేశ్వరాలయంలో ఈనెల 16 నుంచి నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో బీవీ రమణ పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 06:04 IST

గోడపత్రికలు ఆవిస్కరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

సామర్లకోట, న్యూస్‌టుడే: సామర్లకోట భీమేశ్వరాలయంలో ఈనెల 16 నుంచి నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో బీవీ రమణ పేర్కొన్నారు. భీమేశ్వరాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఈ సమావేశానికి ప్రధాన శాఖల అధికారులే హాజరు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఏటా వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు విచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వారికి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి కాలువలో కలుషిత జలాలు కలవకుండా రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖ అధికారులు కమిటీగా ఏర్పడి అరికట్టాలని ఆయన సూచించారు. అనంతరం శాఖల వారీగా ఏర్పాట్లపై ఆర్డీవో సమీక్షించారు. సమావేశంలో జల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, కౌన్సిలర్‌ నేతల హరిబాబు, భాజపా నాయకుడు సుంకవిల్లి బాపిరాజు, బిక్కిన పరమేశ్వరసాయి సత్యనారాయణ తదితరులు పలు సూచనలు చేశారు. ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని