logo

స్వామి వైభవం.. ఆనంద పరవశం

నిత్యం నయనానందకరంగా జరుగుతున్న అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య పరిణయోత్సవాల్లో ఆరో రోజైన గురువారం వైభవంగా సాగిన వాహనోత్సవాల్లో భక్తజనం ఆనంద పారవశ్యంతో ప్రణామాలు చేశారు.

Published : 03 Feb 2023 06:14 IST

న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు

గజ వాహనంపై స్వామి

నిత్యం నయనానందకరంగా జరుగుతున్న అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య పరిణయోత్సవాల్లో ఆరో రోజైన గురువారం వైభవంగా సాగిన వాహనోత్సవాల్లో భక్తజనం ఆనంద పారవశ్యంతో ప్రణామాలు చేశారు. స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లను దర్శించుకుని గ్రామోత్సవాల్లో పాల్గొని తరించారు. అర్చకులు వేదపఠనంతో ఉదయం సుప్రభాత కైంకర్యాలు జరిపాక ప్రత్యేకార్చనలు చేశారు. సాయంత్రం 4 గంటలకు దివ్య మంగళ ఉత్సవమూర్తులను గజ వాహనంపై కొలువుదీర్చారు. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ అంతా జయధ్వానాలు చేస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. 5.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేసి స్వామివారి సన్నిధిని పూర్తిగా శుద్ధి చేశారు. రాత్రి 7 గంటలకు పొలమూరి సత్రం నిర్వాహకులచే అన్నాన్ని ఆలయ సన్నిధిలో రాశిగా పోసి స్వామివారికి వైదిక బృందం నివేదన చేసింది. అనంతరం దానిని ప్రసాదంగా భక్తులకు వితరణ చేశారు. 8.15 గంటలకు స్వామి, అమ్మవార్లు సువర్ణకాంతులతో మెరిసిపోతూ పొన్న వాహనాన్ని అధిష్ఠించి వినువీధిలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని