logo

దిశానిర్దేశం!

ఇంటర్‌ తర్వాత ఏ దిశగా సాగాలనే అంశంపై ‘దశ-దిశ’ పేరుతో గురువారం ‘ఈనాడు-కేఎల్‌ యూనివర్సిటీ’ సంయుక్తంగా రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని కాతేరు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు చక్కటి స్పందన లభించింది

Published : 03 Feb 2023 06:14 IST

ఇంటర్‌ తర్వాత ఏ దిశగా సాగాలనే అంశంపై ‘దశ-దిశ’ పేరుతో గురువారం ‘ఈనాడు-కేఎల్‌ యూనివర్సిటీ’ సంయుక్తంగా రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని కాతేరు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు చక్కటి స్పందన లభించింది. తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ తిరుమలరావు, కేఎల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొబ్బిలి సత్యనారాయణమూర్తి, తిరుమల విద్యాసంస్థల ప్రిన్సిపల్‌ శ్రీహరి, ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన విద్యార్థులకు కేఎల్‌యూ కిట్లు, కూపన్లు అందజేశారు. అనంతరం లక్కీడ్రా తీసి ఎంపికైన నలుగురు విద్యార్థులకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
న్యూస్‌టుడే, కంబాలచెరువు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని