logo

ప్రతిభావంతులకు విదేశీ విద్యా దీవెన

విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతోపాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందని కలెక్టర్‌ మాధవీలత అన్నారు.

Updated : 04 Feb 2023 05:42 IST

పథకం చెక్కుతో కలెక్టర్‌, రుడా ఛైర్‌పర్సన్‌, లబ్ధిదారుల తల్లిదండ్రులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతోపాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందని కలెక్టర్‌ మాధవీలత అన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన లబ్ధి కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్‌ వీసీ సమావేశ హాలులో నిర్వహించారు. జిల్లాలో ఈ పథకం కింద ఎంపికైన అయిదుగురు విద్యార్థులకు మొదటి విడతగా రూ.33.13 లక్షల ట్యూషన్‌ ఫీజును నేరుగా వారి ఖాతాల్లో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జమ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రుడా ఛైర్‌ పర్సన్‌ షర్మిలారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జనార్దనరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సత్యరమేష్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎన్‌.జ్యోతి, డీఆర్‌డీఏ పీడీ సుభాషిణి, లబ్ధిదారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని