logo

చోదకులంతా హెల్మెట్‌ ధరించాల్సిందే

వాహనం నడిపే సమయంలో చోదకులు విధిగా హెల్మెట్‌ ధరించాలని, ఎక్కువ మంది నిబంధన పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తీవ్రగాయమై మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు అన్నారు.

Published : 04 Feb 2023 05:25 IST

కాకినాడలో ద్విచక్ర వాహనాల ర్యాలీ

మసీదు సెంటర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: వాహనం నడిపే సమయంలో చోదకులు విధిగా హెల్మెట్‌ ధరించాలని, ఎక్కువ మంది నిబంధన పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తీవ్రగాయమై మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు అన్నారు. సర్పవరం కూడలిలో వద్ద ‘హెల్మెట్‌ ధారణ..మీ కుటుంబానికి ఆలంబన’ నినాదంతో జిల్లా పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్‌ ధరించు.. చిరంజీవిగా జీవించు అని నినాదాలు చేస్తూ భానుగుడి కూడలి వరకూ ర్యాలీ సాగింది. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోని అధికారులు వాహనదారులకు హెల్మెట్‌ ధారణపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. డీటీసీ మోహన్‌, ఎంవీఐలు, ఏఎస్పీలు శ్రీనివాస్‌, సత్యనారాయణ, డీఎస్పీలు, మోటారు యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని