logo

యువకుడికి జీవిత ఖైదు

పదేళ్ల కిందట జరిగిన యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Published : 04 Feb 2023 05:25 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: పదేళ్ల కిందట జరిగిన యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి సీఐ వైఆర్‌కే శ్రీనివాసు తెలిపిన వివరాలివీ.. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో కె.రేవతిని కత్తులగూడెం ప్రాంతానికి చెందిన ముక్కుడుపల్లి నవీన్‌కుమార్‌ ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. అతడి గురించి యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో పాఠశాల మానిపించి అనపర్తికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. డిసెంబరు 18, 2013న యువతికి పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు రాజమహేంద్రవరం వెళ్లారు. అప్పుడు యువకుడు నవీన్‌ యువతి ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. యువతి అతని నుంచి తప్పించుకునేందుకు వంట గదిలోకి వెళ్లింది. యవకుడు కోరిక తీర్చలేదని ఉద్దేశంతో అక్కడున్న కిరోసిన్‌ పోసి నిప్పు బాలిక శరీరానికి అంటించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపు అతను అక్కడ నుంచి తప్పించుకున్నాడు. దాంతో యువతి ముఖం, మెడ, ఛాతీ, కాళ్లు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె నుంచి వాంగ్మూలం కూడా అప్పట్లో పోలీసులు తీసుకున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ డిసెంబరు 23, 2013న మృతి చెందింది. అప్పటి ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి. నేరం రుజువు కావడంతో శుక్రవారం యువకుడికి జీవిత ఖైదు, రూ.2,250 అపరాధ రుసుం విధించారు. బాధిత బాలిక తల్లిదండ్రులకు రూ.7.50లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని