logo

చైన్‌స్నాచింగ్‌కు యత్నం.. దేహశుద్ధి చేసిన స్థానికులు

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని స్థానిక యువకులు సినీఫక్కీలో పట్టుకున్నారు.

Updated : 04 Feb 2023 15:26 IST

ముమ్మిడివరం: బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని స్థానిక యువకులు సినీఫక్కీలో పట్టుకున్నారు. ఐ.పోలవరంలో నడిచి వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఆరున్నర కాసుల బంగారు గొలుసు లాక్కొని దుండగులు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. బాధితురాలు సత్యవతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వారిని వెంబడించారు. దొంగల్లో ఇద్దరు దొరకగా, ఒకరు పరారీ అయ్యారు. దొరికిన ఇద్దరికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని