logo

ఆక్వా రైతులకు ప్రభుత్వం షాక్‌

అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆక్వా రంగంపై ప్రభుత్వ చర్యలు మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా ఉన్నాయి

Published : 05 Feb 2023 05:44 IST

ఉమ్మడి జిల్లాలో 3,484 మందికి రాయితీ బంద్‌

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆక్వా రంగంపై ప్రభుత్వ చర్యలు మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా ఉన్నాయి. విదేశీ ఎగుమతులు నిలిచి, మేత ధరలు పెరిగి నష్టాల్లో కొనసాగుతున్న ఆక్వా రైతులకు ప్రభుత్వం ఫిబ్రవరిలో షాకిచ్చింది. గత నెల వరకు నిర్వహించిన ఈ-ఫిష్‌ సర్వే ఆధారంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 3,484 మంది ఆక్వా రైతులకు ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్తు రాయితీ ఎత్తివేశారు. దాంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7,404 ఆక్వా విద్యుత్తు సర్వీసులు ఉండగా, వారిలో 3,382 మంది రైతులకు రాయితీ వర్తింపజేశారు. 535 మందికి చెందిన వివరాలు మత్స్యశాఖ అధికారులు విద్యుత్తుశాఖ అధికారులకు ఇవ్వకపోవడంతో వారికి కూడా రాయితీని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పలువురు రైతులు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆక్వారంగాన్ని ప్రభుత్వపరంగా అన్నివిధాలా ప్రోత్సహిస్తామని చెబుతూనే వారు అందించే రాయితీలకు మాత్రం రోజుకో కొర్రీవేస్తూ తమను దగా చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ విధానాలు ఇలాఉంటే ఆక్వాలో శాశ్వత సాగు విరామం చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని