logo

ఇన్‌ఛార్జి ఏపీఎం అక్రమాలపై విచారణ

మండలంలోని మహిళా సమాఖ్య ఇన్‌ఛార్జి ఏపీఎంగా పనిచేస్తున్న అయితాబత్తుల సురేంద్రబాబు మడుపల్లి, శానపల్లిలంక గ్రామాల్లో ఇద్దరు యానిమేటర్లు విధుల్లో లేకపోయినప్పటికీ రికార్డుల్లో పనిచేస్తున్నట్లు చూపించి వారివేతనం అక్రమంగా తీసుకుంటున్నారని, యానిమేటర్ల వద్ద నుంచి లోన్‌అప్రూవల్‌, అడిట్‌ అధికారులకు ఇవ్వాలని రూ.వెయ్యి నుంచి రూ.మూడువేల వరకు ఒక్కొక్కరి నుంచి డబ్బులు దండుకొని తమను వేధిస్తున్నట్లు తొత్తరమూడి గ్రామానికి చెందిన యానిమేటర్‌ బడుగు రమాదేవి గత సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Published : 05 Feb 2023 05:44 IST

యానిమేటర్లను విచారిస్తున్న డీఆర్‌డీఏ పీడీ శివశంకరప్రసాద్‌

అయినవిల్లి, న్యూస్‌టుడే: మండలంలోని మహిళా సమాఖ్య ఇన్‌ఛార్జి ఏపీఎంగా పనిచేస్తున్న అయితాబత్తుల సురేంద్రబాబు మడుపల్లి, శానపల్లిలంక గ్రామాల్లో ఇద్దరు యానిమేటర్లు విధుల్లో లేకపోయినప్పటికీ రికార్డుల్లో పనిచేస్తున్నట్లు చూపించి వారివేతనం అక్రమంగా తీసుకుంటున్నారని, యానిమేటర్ల వద్ద నుంచి లోన్‌అప్రూవల్‌, అడిట్‌ అధికారులకు ఇవ్వాలని రూ.వెయ్యి నుంచి రూ.మూడువేల వరకు ఒక్కొక్కరి నుంచి డబ్బులు దండుకొని తమను వేధిస్తున్నట్లు తొత్తరమూడి గ్రామానికి చెందిన యానిమేటర్‌ బడుగు రమాదేవి గత సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. శనివారం డీఆర్‌డీఏ పీడీ శివశంకరప్రసాద్‌ మండలంలోని యానిమేటర్లను కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. దీనిపై నివేదిక తయారుచేసి కలెక్టర్‌కు పంపుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు