సందేశమివ్వు..సందేహం తీరు!
కొబ్బరిసాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఏపీ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు
న్యూస్‌టుడే, అంబాజీపేట
కొబ్బరిసాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఏపీ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. కొబ్బరిపంటకు వ్యాపించే తెగుళ్లు, పురుగులు, కొబ్బరినూతన వంగడాలు, సాగుపద్ధతులు ఇలా పలు అంశాలపై ఆయన ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు. కర్షకులు తమ సందేహాలను 73826 33653 ఈ నంబర్‌కు వాట్సాప్‌లో పంపితే సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
* అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో అన్నదాతలకు అందిస్తున్న సేవలేవీ ?.
డాక్టర్ బి.శ్రీనివాసులు: రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తున్నాం. కొబ్బరి, కొబ్బరితోటల్లో అంతరపంటల సాగు విధానాలపై జీవనియంత్రణ పద్ధతులు, నర్సరీ పెంపకం, కొబ్బరిలో సంకరీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.వాట్సాప్ ద్వారా ప్రత్యేక సలహాలు, సూచనలు ఇస్తున్నాం.
* కొబ్బరిపంటను ఆశించి నష్టం చేకూర్చుతున్న తెల్లదోమ నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు.?
కొబ్బరిలో తెల్లదోమ నివారణకు సమగ్ర కీటక యాజమాన్య పద్ధతులను అభివృద్ధి చేశాం. దీనిలో భాగంగా బదనికలను రైతులకు తక్కువ ధరకు అందజేస్తున్నాం. ఈ తెల్లదోమ నివారణకు జీవనియంత్రణ ద్వారా విస్తృతమైన పరిశోధనలు కూడా జరుపుతున్నాం.తెల్లదోమ నివారణకు ఉపయోగించే బదనికల అభివృధ్ధికి వివిధ సంస్థలకు ఎంవోయూ ద్వారా సాంకేతికతను పెంపొందిస్తున్నాం.
* కొబ్బరిసాగు విస్తీర్ణం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు.?
కొబ్బరిలో అయిదు రకాలతో పాటు నాలుగు హైబ్రీడు రకాలను విడుదల చేశాం. నాణ్యమైన కొబ్బరిమొక్కల తయారీ చేసి సరఫరా చేస్తున్నాం. కొబ్బరిసాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు, సమావేశాలు, సంకరీకరణపై శిక్షణలు నిర్వహిస్తున్నాం.
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో కొబ్బరిరైతులకు చేకూరుతున్న ప్రయోజనం.?
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో భాగంగా ఎంపిక చేసిన రైతులకు జీవశిలీంధ్రాలైన ట్త్రెకోడెర్మా, సూడోమోనాస్, బదనికలైన అపెర్టోక్రైసా ఆస్టర్ వంటివి రైతులకు అందజేస్తున్నాం. బ్యాటరీ పిచికారీ యంత్రాలను ఎస్సీ రైతులకు అందజేశాం.
* ఉచితంగా అందిస్తున్న సేవలు.?.
రైతుల క్షేత్రసందర్శన, శిక్షణ కార్యక్రమాలు, రైతులతో - ఉద్యాన శాస్త్రవేత్తముఖాముఖి, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన, సంకరీకరణ, నర్సరీ యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమాలు, పురుగులు, తెగుళ్లు అరికట్టే విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం.
* తెగుళ్లు, పురుగుల నివారణకు వినియోగించే బదనికల సరఫరా ఏఏ జిల్లాలు, రాష్ట్రాలకు చేస్తున్నారు..?
కొబ్బరిపంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు ఉత్పత్తి చేస్తున్న అనేక జీవశిలీంధ్రాలు, బదనికలు అంతర పంటలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.వీటిని ఏపీలోని అన్ని ప్రాంతాలతో పాటు ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అందజేస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా