logo

శోభాయమానం.. భీమేశ్వరుని రథోత్సవం

ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా నాలుగో రోజు శనివారం రథోత్సవం శోభాయమానంగా జరిగింది

Published : 05 Feb 2023 05:47 IST

రథంపై ఉత్సవ మూర్తులు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా నాలుగో రోజు శనివారం రథోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో ఉదయం 5.30 గంటలకు మేలు కొలుపు, 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు భక్తులతో విశేష పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు గ్రామోత్సవం జరిగింది. మధ్యాహ్నం 2.45 గంటలకు ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొత్త రథానికి గుమ్మడికాయ కొట్టి ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ద్రాక్షారామ, వెలంపాలెం పురవీధుల్లో రథోత్సవం ఉత్సాహంగా సాగింది. మార్గమధ్యంలో పలువురు రథం లాగేవారికి మంచినీరు, శీతలపానీయాలు, మజ్జిక, టీ అందించారు.  మార్కెట్టులోని రథం వీధిగుండా యానాం సెంటరు మీదుగా వేగాయమ్మపేట ఆస్థాన మండపానికి సాయంత్రం 6 గంటలకు చేరుకుంది. 6.30 గంటలకు వేగాయమ్మపేట జమీందారు వంశీయులు రాజా వాడ్రేవు సుందర రత్నాకర్‌, ఆలయ కార్యనిర్వాహణాధికారి పీటీవీవీ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆస్థానపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది.

కొత్త రథానికి సాంకేతిక ఇబ్బందులు..

రథోత్సవం ప్రారంభమైన పది నిమిషాల్లోనే బ్రేకు పట్టేయడంతో అరగంట సేపు మరమ్మతులు చేసి తిరిగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా పాత రథం కన్నా 7 అడుగులు అదనంగా ఎత్తు పెంచడంతో అడుగడుగునా విద్యుత్తు తీగలు కత్తిరించుకొంటూ ముందుకు సాగాల్సి వచ్చింది. రథానికి ఉండే ఆరు చక్రాల్లో ఎడమవైపు ముందు చక్రం నేలపై ఆనడం లేదు. దీనిని సరి చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని