logo

మంత్రి హామీ.. అమలుకు నోచుకోదేమీ..: తెదేపా

అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఏడాదిన్నర క్రితం మంత్రి విశ్వరూప్‌ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హోదాలో హామీ ఇచ్చినా..

Published : 05 Feb 2023 05:47 IST

గోడి బాలుర గురుకులంలో మరుగుదొడ్లు పరిశీలిస్తున్న హరీష్‌

అల్లవరం, న్యూస్‌టుడే: అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఏడాదిన్నర క్రితం మంత్రి విశ్వరూప్‌ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హోదాలో హామీ ఇచ్చినా.. అమలుకు నోచుకోలేదని తెదేపా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంటి హరీష్‌మాథుర్‌ విమర్శించారు. శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు ఆనందరావు, చిల్లా జగదీశ్వరి, తెదేపా నాయకులతో కలిసి గోడి గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఇక్కడ బాలుర, బాలికల పాఠశాలల్లో చదువుతున్న సుమారు 1200 మంది సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. విద్యార్థుల స్నానాలకు, నిత్యావసరాలకు శుభ్రమైన నీరు లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు రాత్రికి రాత్రే చీకటి జీవోలు జారీ చేస్తారుకానీ.. రాష్ట్రంలో విద్యార్థుల, ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కిటికీలకు తలుపుల్లేక దోమలతో ఇబ్బందిపడే పరిస్థితి వసతిగృహంలో నెలకొందన్నారు. నెలరోజుల్లోగా గురుకుల పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించకపోతే నేరుగా నిరసన దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెదేపా మండల అధ్యక్షుడు సత్తిబాబురాజు మాట్లాడుతూ గోడి గురుకుల పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం వల్ల కాకపోతే.. తనకు అప్పగిస్తే సొంత ఖర్చుతో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. యాళ్ల కాసుబాబు, కిరణ్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని