logo

తెలుగు వెలుగు ప్రపంచమంతా ప్రసరించాలి

తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని, ఇటువంటి సదస్సుల ద్వారా తెలుగు వెలుగు ప్రపంచానికి ప్రసరింపజేసేలా మరింత కృషి చేయాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి అన్నారు.

Updated : 05 Feb 2023 06:04 IST

యజ్ఞ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు

నన్నయ విశ్వవిద్యాలయం(రాజానగరం): తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని, ఇటువంటి సదస్సుల ద్వారా తెలుగు వెలుగు ప్రపంచానికి ప్రసరింపజేసేలా మరింత కృషి చేయాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి అన్నారు. నన్నయలో నిర్వహించిన ప్రాచీన తెలుగు సాహిత్యం, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక దృక్పథాలు అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల సదస్సు శనివారం ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన వరప్రసాదమూర్తి మాట్లాడుతూ భాషలోని వివిధ కోణాలను, సాహిత్య, చారిత్రక, సామాజిక నేపథ్యాలను వక్తలు, పరిశోధకులు వివరించారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలన్నారు. ఓఎస్డీ ఆచార్య ఎస్‌.టేకి మాట్లాడుతూ ఈ సదస్సులో చక్కని పరిశోధనా పత్రాలను సమర్పించిన పరిశోధకులు అభినందనీయులన్నారు. జాతీయ సదస్సు సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్‌ కుమార్‌, కన్వీనర్‌ డా.తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ సదస్సులో 90 పరిశోధన పత్రాలను సమర్పించారన్నారు. అనంతరం కన్వీనర్‌ డా. తరపట్ల సత్యనారాయణ రచించిన యజ్ఞ వచన కవిత్వ కన్నడ అనువాద పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం అతిథులను సన్మానించి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డా.కేవీఎన్డీ వరప్రసాద్‌, డా.పీవీబీ సంజీవరావు, బి.వెంకటేశ్వరరావు, నూజిళ్ల శ్రీనివాసరావు, డా.ఎస్‌. సుధారాణి, డా.జె.మాధ్యాన తెలంగాణ, డా.నూనె అంకమరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని