పరీక్షల నాటికి సిద్ధమయ్యేనా ?
కళాశాలలో మొత్తం నాలుగు ప్రయోగశాలలున్నాయి. కొన్ని పరికరాలను కొద్ది రోజులుగా వినియోగించక మూలన పడి ఉన్నాయి. పలు రకాల పరికరాల కొరత ఉంది. స్క్రూగేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ తదితర పరికరాలు తుప్పుపట్టి కనిపించాయి.
కొన్ని ఇంటర్ ప్రయోగశాలల తీరిది
ఏలూరు జూనియర్ కళాశాలలో ఇలా..
కళాశాలలో మొత్తం నాలుగు ప్రయోగశాలలున్నాయి. కొన్ని పరికరాలను కొద్ది రోజులుగా వినియోగించక మూలన పడి ఉన్నాయి. పలు రకాల పరికరాల కొరత ఉంది. స్క్రూగేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ తదితర పరికరాలు తుప్పుపట్టి కనిపించాయి. అవసరమైన కొత్త పరికరాల్ని ఇటీవలే కొనుగోలు చేశామని, ప్రయోగ పరీక్షల ప్రారంభం నాటికి వాటిని సంసిద్ధం చేస్తామని ప్రధానాచార్యుడు తెలిపారు* రసాయన శాస్త్ర పరికరాలన్నీ పూర్తిగా దుమ్ము పట్టి ఉన్నాయి* వృక్ష, జంతు శాస్త్ర ప్రయోగశాలల్లో పరికరాలన్నీ దాదాపు బీరువాలకే పరిమితం. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేనందున ప్రయోగశాలల్లోనే థియరీ తరగతులు నిర్వహిస్తున్నారు.
శూన్యంలో ప్రయోగం
తాడేపల్లిగూడెం అర్బన్, వన్‌టౌన్ న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఇరుకు గదుల మధ్య నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది విద్యార్థులున్నా.. ఆ మేరకు గదులు లేవు. తరగతి గదిలోనే ఒక మూల ప్రయోగశాలను నిర్వహించుకోవాల్సిన దుస్థితి.
ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు... వృత్తివిద్య విద్యార్థులకు ఈ నెల 20 నుంచి, జనరల్ వారికి 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటి నిర్వహణకు కొద్ది రోజుల వ్యవధే ఉంది. ఈ నేపథ్యంలో సంసిద్ధతపై ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలను ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది.
పరికరాలు లేవు ఎలా...
కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ విభాగంలో సీఈటి గ్రూపు విద్యార్థులు పరికరాల లేమితో ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా పరికరాలు మూలకు చేరడంతో ఉపాధ్యాయులు చరవాణి ఆధారంగానే విద్యార్థులకు ప్రయోగాలపై తర్ఫీదు అందిస్తున్నారు. సర్వే నిర్వహించేందుకు కావాల్సిన డంపిలెవెల్, డంపిండ్ స్టాండ్లు, డ్రాయింగ్ బోర్డులు, సిమెంటు, కంకర మిశ్రమాలను సరిచూసే నమూనా యంత్రం, బరువు యంత్రం వంటి పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్త వాటి కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు.
తరగతి గదిలోనే
యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలి మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక ఉన్నత పాఠశాల పై భాగంలో ఉన్న గదులను కేటాయించారు. ఈ కళాశాలలో తరగతి గదిలోనే ఒక మూలన ప్రయోగశాల నిర్వహిస్తున్నారు. ఉన్న 19 మంది విద్యార్థులకు ఇది సరిపోతుందని అధ్యాపకులు చెబుతున్నారు.
ఓ పక్కన .. పనులు
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : జంగారెడ్డిగూడెం ఎస్‌డీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలల గదుల్లో నాడు నేడు పనులు చేపట్టారు. నాలుగు ప్రయోగశాలల్లో ఫ్లోరింగ్ నిర్మిస్తున్నారు. దీంతో పరికరాలను ఇతర గదుల్లోకి మార్చారు. మరో పక్క ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రయోగ పరీక్షలు జరిగే నాటికి సిద్ధం చేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.
వారే సిద్ధం చేసుకోవాలి
ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు (జూనియర్ కళాశాలలు) సంబంధించిన వారే ప్రయోగ పరికరాలను సిద్ధం చేసుకోవాలి. పరీక్షల ప్రారంభానికి కొద్ది రోజుల ముందుగా ఎగ్జామినర్లు సంబంధిత కేంద్రాలకు వెళ్లి ప్రయోగశాలలను పరిశీలిస్తారు. వాటిలోని స్థితిగతులను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటేనే తగిన ధ్రువపత్రం ఇస్తారు. ప్రయోగ పరీక్షలకు కేటాయించిన కేంద్రాల్లో అన్నిరకాల వసతులు కల్పించేలా ఇప్పటికే ఆయా కళాశాలల ప్రధానాచార్యులకు ఆదేశాలు ఇచ్చాం.
కె.చంద్రశేఖర్‌బాబు, ఆర్‌ఐవో
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు
-
India News
Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)