logo

సీపీఎస్‌ రద్దు చేసే వరకు పోరాటం

న్యాయమైన హక్కుల కోసం   సంకల్ప దీక్ష చేపడితే అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేయటం దారుణమని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి అన్నారు.

Published : 06 Feb 2023 05:11 IST

ప్రసంగిస్తున్న ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ నాయకుడు సతీష్‌

శ్యామలాసెంటర్‌(రాజమహేంద్రవరం): న్యాయమైన హక్కుల కోసం   సంకల్ప దీక్ష చేపడితే అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేయటం దారుణమని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి అన్నారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన దీక్షను ఆదివారం ఆమె ప్రారంభించారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందన్నారు. సీపీఎస్‌ రద్దు వరకు మా పోరాటం ఆగదన్నారు. జిల్లా అధ్యక్షుడు   జయకర్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని మాత్రమే తాము న్యాయంగా అడుగుతున్నామన్నారు. ఎల్‌ఐసీ సంఘ నాయకుడు సతీష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు రూ.వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వ  ఉద్యోగులకు పెన్షన్‌ ఇవ్వడానికి ప్రతి విషయంలో అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. సీఐటీయూ నాయకులు అరుణ్‌కుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎ.షరీఫ్‌, జిల్లా గౌరవాధ్యక్షుడు శంకరుడు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు