logo

చేరువైతే సేవ.. దూరమవదా క్షయ

ఉమ్మడి  ఉభయ గోదావరి జిల్లాల్లో 12 శాతం మంది టీబీ(క్షయ) సోకి అవస్థలు పడుతున్నారు... ఇదీ రాజమహేంద్రవరం వీటీ జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు యార్లగడ్డ ప్రభాకర్‌ గుర్తించిన పరిస్థితి.

Updated : 06 Feb 2023 05:28 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

మ్మడి  ఉభయ గోదావరి జిల్లాల్లో 12 శాతం మంది టీబీ(క్షయ) సోకి అవస్థలు పడుతున్నారు... ఇదీ రాజమహేంద్రవరం వీటీ జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు యార్లగడ్డ ప్రభాకర్‌ గుర్తించిన పరిస్థితి. ‘ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్షయ వ్యాధిగ్రస్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక విపత్తులు’ అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఏయూ నుంచి పీహెచ్‌డీ పొందిన ఆయన పరిశోధనలో వెల్లడించిన ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.
భారతదేశంలో ఏడాదికి 13 లక్షల మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలని నిర్ణయించినా... 2030 నాటికేనా ఇది సాధ్యమా అనేదే ప్రశ్న.

ఇదీ గోదావరి జిల్లాల్లో పరిస్థితి...

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 400 మంది వ్యాధిగ్రస్థులతో మాట్లాడి వారి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులను 88 ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు ప్రభాకర్‌. ఉభయ జిల్లాల్లో మొత్తం జనాభాలో 12 శాతం మంది క్షయకు గురైనట్లు గుర్తించారు. వీరిలో తూర్పుగోదావరి ఎనిమిది, పశ్చిమ గోదావరిలో నాలుగు శాతం మంది వ్యాధికి గురైనట్లు పరిశోధనలో తెలిసింది.  

ఇంకా ఏం గుర్తించారంటే...

టీబీ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కుటుంబంపై ఆర్థిక భారం పెరుగుతోంది. వార్షిక ఆదాయం తగ్గుతోంది. ఆరోగ్య ఖర్చులు పెరిగి అప్పులపాలై ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. రవాణా, ఆహారం, న్యూట్రిషన్‌ మొదలైన ఖర్చులు వారికి పెరుగుతున్నాయి.  


మరేం చేయాలి...

వ్యాధికి ప్రభుత్వం వైద్యం, మందులు అందించినా ఇతర ఖర్చులు అధికమై అప్పులపాలవుతున్నారని, ప్రభుత్వాలు ఈ విషయమై ఆలోచించాలని ప్రభాకర్‌ చెబుతున్నారు. డాట్‌ సెంటర్లు పెంచాలని, వ్యాధిగ్రస్థులపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో ఎయిర్‌ క్లీనింగ్‌ కంట్రోల్‌ పద్ధతి, సంచార వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నారు. జాతీయ క్షయ నివారణ పథకాన్ని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరించాలని, మందుల ధరలు తగ్గించాలని, చిన్నపిల్లలు, బాలింతలకు గ్రామీణ, రిమోట్‌ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం, మందులు అందించాలని కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు