logo

హస్తినలో ప్రదర్శన అద్భుతఘట్టం

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ కర్తవ్యపథ్‌ కవాతులో కోనసీమ ప్రాంతం నుంచి అందించిన గరగనృత్య ప్రదర్శన అద్వితీయం...అద్భుత ఘట్టం..అభినందనీయమని సమాచార శాఖ జాయింట్‌ డైరెక్టర్‌, ఏపీ భవన్‌ ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్‌ కితాబు ఇచ్చారు.

Published : 06 Feb 2023 05:11 IST

ముక్కామల(అంబాజీపేట), న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ కర్తవ్యపథ్‌ కవాతులో కోనసీమ ప్రాంతం నుంచి అందించిన గరగనృత్య ప్రదర్శన అద్వితీయం...అద్భుత ఘట్టం..అభినందనీయమని సమాచార శాఖ జాయింట్‌ డైరెక్టర్‌, ఏపీ భవన్‌ ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్‌ కితాబు ఇచ్చారు.ఏపీ తరఫున సంక్రాంతి కనుమ ప్రభల తీర్థం థీమ్‌తో ఏర్పాటు చేసిన శకటంతో పాటు గరగనృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుందన్నారు. ఇది ఏపీలోని కోనసీమకు దక్కిన అరుదైన గౌరవంగా భావించాలన్నారు. ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు గరగ నృత్యం బృందం సభ్యులను స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వైకాపానేత బండారు మల్లిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా జేడీ మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యురాలు బూడిద వరలక్ష్మి, మాజీ సర్పంచి దేవరపల్లి చినబాలయోగి, నాయకులు దువ్వూరి బాలకృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి వి.తాతాజీ, గరగనృత్య కళాకారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని