logo

‘ప్రాధాన్యమివ్వకే పార్టీ వీడుతున్నాం’

కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామానికి చెందిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్లు ఇద్దరు ఆదివారం వైకాపాకు రాజీనామా చేశారు.

Published : 06 Feb 2023 05:11 IST

పుల్ల శ్రీరాములు, శేషుకుమారి

సర్పవరం జంక్షన్‌: కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామానికి చెందిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్లు ఇద్దరు ఆదివారం వైకాపాకు రాజీనామా చేశారు. సర్పవరం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఛైర్మన్లు పుల్ల శ్రీరాములు (శ్రీను), శేషుకుమారి దంపతులు మాట్లాడారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌గా తమకు అవకాశం కల్పించినప్పటికీ ఎటువంటి ఆధికారాలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పార్టీ కార్యకలాపాల్లో ఎటువంటి భాగస్వామ్యం కల్పించకపోవడంతో మనస్తాపం చెందామన్నారు. త్వరలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు