logo

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి కృషి చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత సూచించారు.

Published : 07 Feb 2023 05:14 IST

ఉపకార వేతనాలు పొందిన విద్యార్థినులతో కలెక్టర్‌ తదితరులు

రాజమహేంద్రవరం సాంస్కృతికం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి కృషి చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత సూచించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీలో భాగంగా మలబార్‌ గోల్డ్‌ సంస్థ జిల్లాలోని 24 ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థినులు 406 మందికి సోమవారం ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆనం కళాకేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ 406 మందికి రూ.37.52 లక్షల స్కాలర్‌ షిప్స్‌ అందజేశారు. మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనకు నూరుశాతం కృషి చేయాలన్నారు. మలబార్‌ గోల్డ్‌ రాజమహేంద్రవరం హెడ్‌ కె.ఫెబిన్‌, మేనేజర్‌ కె.వెంకట లక్ష్మీపతి, ప్రవీణ్‌ కుమార్‌, లయన్స్‌ జిల్లా గవర్నర్‌ మంగతాయారు, ఇంటర్‌ బోర్డ్‌ ఆర్‌జేడీ శారద, జె.వి.వి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు