logo

ఉద్యోగుల ఆత్మాభిమానం కాపాడుకోవాలి

ప్రతినెలా 1న జీతాలు, పింఛన్లు ఇచ్చేలా చట్టం చేయాలనే అంశం ఏ ఒక్క ఉద్యోగి, సంఘానికి సంబంధించిన సమస్య కాదని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లకు సంబంధించినదని ఏపీఈజీఏ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 05:14 IST

సమావేశమైన సంఘ నాయకులు

మసీదు సెంటర్‌ (కాకినాడ): ప్రతినెలా 1న జీతాలు, పింఛన్లు ఇచ్చేలా చట్టం చేయాలనే అంశం ఏ ఒక్క ఉద్యోగి, సంఘానికి సంబంధించిన సమస్య కాదని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లకు సంబంధించినదని ఏపీఈజీఏ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం పేర్కొన్నారు. ఆ సంఘ కార్యాలయంలో సోమవారం ‘ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబద్ధత’పై ఆ సంఘ అధ్యక్షుడు జగన్నాథం అధ్యక్షతన చర్చావేదిక నిర్వహించారు. ఆ సంఘ కార్యదర్శి డా.వీరయ్య మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మాభిమానం కాపాడుకోడంలో ఏపీఈజీఏ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. సంఘ డైరీని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవిష్కరించారు. ర.భ. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపారావు, ఐఎన్‌టీయూసీ నాయకులు రామిరెడ్డి, శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, ఇతర సంఘాల నాయకులు డా.శైలజ, గోవిందు, అప్పలరాజు, రాజామణి, బ్రహ్మేంద్ర, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని