logo

సెంటు భూమినీ ఎండిపోనివ్వం

రామచంద్రపురం నియోజకవర్గంలో దాళ్వా పంటలో సెంటు భూమి కూడా ఎండిపోనివ్వమని, శివారు భూములకు కూడా నీటిని అందిస్తామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.

Published : 07 Feb 2023 05:14 IST

ఎర్రపోతవరం లాకుల వద్ద నీటి పరిమాణాన్ని పరిశీలిస్తున్న మంత్రి వేణు, అధికార బృందం

పామర్రు: రామచంద్రపురం నియోజకవర్గంలో దాళ్వా పంటలో సెంటు భూమి కూడా ఎండిపోనివ్వమని, శివారు భూములకు కూడా నీటిని అందిస్తామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.గంగవరం మండలంలోని శివల, ఎర్రపోతవరం, కుడుపూరు గ్రామాల్లో నీళ్లందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆయా గ్రామాల్లో సోమవారం పర్యటించారు. శివల శివారు పంట భూముల్లో నీరు లేకుండా బీటలు వారిన చేలను చూశారు. ఎర్రపోతవరం లాకుల వద్ద ప్రవహిస్తున్న నీటి పరిమాణాన్ని పరిశీలించారు. జలవనరుల శాఖ డీఈ వి.రామకృష్ణ, ఏఈ సుజాత, తహసీల్దార్‌ వైద్యనాథ్‌ శర్మలు ఆయకట్టు పరిమాణాన్ని, నీటి సరఫరా పరిస్థితిని మంత్రికి వివరించారు. ఈ గ్రామాల్లో పారుతున్న టేకి డ్రెయిన్‌లో ఎల్లపుడూ నీరు ప్రవహిస్తున్నందున రైతులు డీజిల్‌ ఇంజిన్లతో తోడుకోవాలని మంత్రి సూచించారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వంతో చర్చించి ఈ ఖర్చును రైతులకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ పంపన నాగమణి, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పెట్టా శ్రీనివవాసు, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు పండు గోవిందరాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు