logo

ఈ-ఫిష్‌ సర్వే రద్దుకు ఆక్వా రైతుల డిమాండ్‌

ఆక్వా చెరువులకు విద్యుత్తు రాయితీ తొలగించేందుకు విడుదలచేసిన ఈ-ఫిష్‌ సర్వేను రద్దు చేయాలని  సోమవారం కలెక్టరేట్‌ వద్ద అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆక్వా రైతులు నిరసన వ్యక్తం చేశారు.

Published : 07 Feb 2023 05:14 IST

కలెక్టరేట్‌ వద్ద ఆక్వా రైతుల నిరసన

అమలాపురం కలెక్టరేట్‌: ఆక్వా చెరువులకు విద్యుత్తు రాయితీ తొలగించేందుకు విడుదలచేసిన ఈ-ఫిష్‌ సర్వేను రద్దు చేయాలని  సోమవారం కలెక్టరేట్‌ వద్ద అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆక్వా రైతులు నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ గతంలో ఎలాంటి పరిమితులు, నిబంధనలు లేకుండా విద్యుత్తు రాయితీ అందించేవారని, ఆ తరువాత అనేక మార్పుచేర్పులు చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు ఈ-ఫిష్‌ సర్వేను తెరపైకి తీసుకొచ్చి రాయితీకి మంగళం పాడేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఈ-ఫిష్‌ సర్వే తప్పులతడకలుగా ఉందన్నారు. ప్రభుత్వ చర్యలతో వందలాది కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం నెలకొందన్నారు. విద్యుత్తు బిల్లులను చెల్లించకుండా రైతులు ప్రతిఘటించాలన్నారు. మత్స్యశాఖ జిల్లా అధికారి తప్పిదం వల్లే ఈ తప్పుడు నివేదికలొచ్చాయని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సమస్యపై సానుకూల నిర్ణయం రాకుంటే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో టి.నాగభూషణం, దెందుకూరి సత్తిబాబు, రుద్రరాజు నానీరాజు, మేడిద శంఖరం పాల్గొన్నారు.

రాయితీ పునరుద్ధరణకు చర్యలు

ఈ-ఫిష్‌ సర్వే ఆధారంగా అన్హరత జాబితాలో చేర్చిన చెరువుల సర్వే నంబర్లను ఆక్వా జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి షేక్‌లాల్‌ మహ్మద్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ హిమాన్షుశుక్లా మత్స్యశాఖ, విద్యుత్తుశాఖ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి విద్యుత్తు బిల్లుకు పాత విధానమే అనుసరించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని