logo

నేటి నుంచి ఇసుక టిప్పర్ల సమ్మె

ఇసుక రవాణా లారీలపై అక్రమ కేసులను నిరసిస్తూ మంగళవారం నుంచి టిప్పరు లారీల సమ్మె చేస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ జిల్లా గోదావరి క్వారీ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రావూరి రాజా సోమవారం తెలిపారు.

Published : 07 Feb 2023 05:08 IST

కొవ్వూరు పట్టణం: ఇసుక రవాణా లారీలపై అక్రమ కేసులను నిరసిస్తూ మంగళవారం నుంచి టిప్పరు లారీల సమ్మె చేస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ జిల్లా గోదావరి క్వారీ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రావూరి రాజా సోమవారం తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే ఇసుక ర్యాంపుల్లో బాటల పేరుతో లారీల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారని.. లారీ యజమానులు, డ్రైవర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.  ఈ నేపథ్యంలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యామని ఆయన చెప్పారు.


10న డీఆర్సీ సమావేశం

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లా సమీక్ష సమావేశం(డీఆర్సీ) ఈ నెల 10న జరుగుతుందని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆ రోజ ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగే సమావేశంలో జిల్లా మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని