logo

Theft: బాల నేరస్థులు.. వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కారు..!

చిన్నతనంలోనే చోరీలకు అలవాటుపడ్డారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ చోరీలు చేస్తూ పరారవుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పోలీసులకు దొరికిపోయారు.

Updated : 27 Feb 2023 12:04 IST

కొత్తపల్లి, కాజులూరు: చిన్నతనంలోనే చోరీలకు అలవాటుపడ్డారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ చోరీలు చేస్తూ పరారవుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పోలీసులకు దొరికిపోయారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇటీవల జరిగిన వరుస చోరీల్లో బాల నేరస్థుల పాత్ర ఉంది. ఈనెల 7వ తేదీన ఆర్యవటంలో మహిళా పోలీసు ఇంటిలో, ఆ తర్వాత గొల్లపాలెం పరిసర ప్రాంతాల్లో మూడు చోట్ల చోరీలు చేశారు.

ఈనెల 21న ఆర్యవటంలో మందుల షాపుతో పాటు అదే రోజు మరో రెండు చోట్ల దొంగతనాలు చేయగా ప్రత్యేక నిఘా పెట్టిన గొల్లపాలెం పోలీసులు ఈనెల 22న మండలంలోని దుగ్గుదూరుకు చెందిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కాకినాడ ద్వారకానగర్‌కు చెందిన మరో ఇద్దరు బాలురు చోరీలకు పాల్పడుతున్నారని గుర్తించి వారినీ అదుపులోకి తీసుకున్నారు. మండలంలో జరిగిన ఘటనలతో ద్రాక్షారామ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో వీరు హస్తలాఘవం ప్రదర్శించినట్లు విచారణలో వెల్లడైంది. మరిన్ని ఆధారాలు సేకరించి డబ్బు రికవరీ చేసేందుకు స్టేషన్లో ఉంచగా ఈనెల 24న తెల్లవారుజామున పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. అనంతరం ఓ ఇంటి గేటు పగులగొట్టి ద్విచక్ర వాహనం దొంగిలించి పారిపోయారు.  

రోడ్డు ప్రమాదం పట్టించింది..

పిఠాపురంలో శనివారం మద్యం తాగి ద్విచక్ర వాహనంపై ముగ్గురూ వస్తుండగా కొండెవరం సమీపంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరు గాయపడి దొరికిపోగా ఒకడు పారిపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని