logo

తల్లడిల్లె హృదయం... చెమ్మగిల్లె నయనం

వావివరస మరిచారు.. వెంటాడి వేధించారు.. పెద్దలు తప్పన్నారు.. చర్యలు తప్పవన్నారు.. అవమానమని కక్షగట్టారు.. వీడమన్నా కాటేశారు.. వేడుకున్నా కడతేర్చారు.. కర్కశంగా కాల్చేశారు..

Updated : 11 Mar 2023 03:23 IST

వావివరస మరిచారు..
వెంటాడి వేధించారు..
పెద్దలు తప్పన్నారు..
చర్యలు తప్పవన్నారు..

అవమానమని కక్షగట్టారు..
వీడమన్నా కాటేశారు..
వేడుకున్నా కడతేర్చారు..
కర్కశంగా కాల్చేశారు..

కల్మషమెరుగని అతివ బలి

ఎదిగొచ్చిన బిడ్డలు..
నిలదొక్కుకుంటారని ధ్యాస..
ముదిమి ముసిరిన వేళ..
ఆసరాగా నిలుస్తారనే ఆశ..

పేరు తెస్తారనుకుంటే
పరువు తీశారు..
తరగని ప్రేమని తలస్తే..
తలవంపులు మిగిల్చారు..

కరుణపంచిన అమ్మ బలవన్మరణం

ఇద్దరి దుశ్చర్య ఫలితం..
రెండు నిండు ప్రాణాలు..
అనుబంధాల్లో నిర్వేదం.. అంతు లేని విషాదం...

రాయవరం మండలం సోమేశ్వరం పరిధిలో వివాహితపై ఇద్దరు సోదరుల లైంగిక దాడి.. దారుణహత్య సంచలనం రేపింది. ఈ అమానవీయానికి ఒడిగట్టిన కుమారుల తీరును అవమానంగా తలచి వారి తల్లి బలవన్మరణానికి పాల్పడగా ప్రతి హృదయం తల్లడిల్లింది.. ప్రతి నయనం చెమ్మగిల్లింది.

న్యూస్‌టుడే, రాయవరం, రామచంద్రపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని