logo

లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం జరుగుతుందని అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్‌ రాజగోపాల్‌ పేర్కొన్నారు.

Published : 19 Mar 2023 06:07 IST

మాట్లాడుతున్న అదనపు జిల్లా న్యాయమూర్తి రాజగోపాల్‌

దానవాయిపేట: లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం జరుగుతుందని అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్‌ రాజగోపాల్‌ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా 38 కేసులు పరిష్కరించి రూ.73.33 లక్షల మేర పరిహారం కక్షిదారులకు అందజేశారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో మోటార్‌ వాహనాల సవరణ చట్టం, నిబంధనలపై జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి రాజగోపాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నూతన సవరణలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ, పోలీసు, బీమా  సంస్థలు పాటించాల్సిన నిబంధనలు వివరించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి, పోలీసు, బీమా సంస్థల సభ్యులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు