logo

‘మా పొలాలు తవ్వేస్తున్నారు..’

నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మట్టి తరలింపు పేరిట తమ సొంత భూముల నుంచి మట్టి తవ్వేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Updated : 20 Mar 2023 11:41 IST

మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మట్టి తరలింపు పేరిట తమ సొంత భూముల నుంచి మట్టి తవ్వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 1942 నుంచి ఈ భూములు రిజిస్ట్రేషన్‌ ద్వారా క్రయ విక్రయాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం చొళం చెరువులో జగనన్న కాలనీల పూడికకు మట్టి తరలిస్తున్నారని, అదే క్రమంలో తమ పట్టా భూముల్లో కూడా తవ్వకాలు జరుగుతున్నారని వాటిని అడ్డుకోవాలని కోరారు. కాకుల నంగాలమ్మకు చెందిన 3.50 ఎకరాలు, వెలుగుల శ్రీనివాసరావుకు చెందిన 2.45 ఎకరాలు, మర్యాదల లక్ష్మిపోలమ్మల ఆధీనంలో ఉన్న 2.90 ఎకరాల భూముల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారని దానిని నిలుపుదల చేసి తమకు సహకరించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని నిడదవోలు తహసీల్దారు కె.గంగరాజు దృష్టికి తీసుకెళ్లగా చొళం చెరువు ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరిపేందుకు జలవనరులశాఖ, మైనింగ్‌ శాఖల అనుమతులు ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని