logo

‘నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు’

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రజాస్వామిక జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు పేర్కొన్నారు.

Published : 20 Mar 2023 05:33 IST

పోలీసులను ప్రశ్నిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి మధు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రజాస్వామిక జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసులు సీపీఐ కార్యాలయానికి చేరుకుని  మధుతోపాటు, రాంబాబు, కొండలరావు, రమణ, రాజు, దేవుడు తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్‌కాలం నాటి చట్టాలతో ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు చేపట్టే ఉద్యమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం జీవో నంబరు 1ను తీసుకొచ్చిందన్నారు. మానవహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ముందస్తు అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, కాకినాడ, తుని, పెద్దాపురం, తదితర ప్రాంతాల్లో ప్రజాసంఘాలు, వామపక్షపార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని