logo

ఆటకు అనువు.. సాధనకు సులువు

అమలాపురంలోని బాలయోగి క్రీడా మైదానంలో అసౌకర్యాలపై ‘ఈనాడు’లో గత నెల 27న ‘ఆడేదెలా.. అర్జునలొచ్చేదెలా..?’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

Updated : 20 Mar 2023 06:20 IST

కొత్తగా ఏర్పాటు చేసిన క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్‌ కోర్టు

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: అమలాపురంలోని బాలయోగి క్రీడా మైదానంలో అసౌకర్యాలపై ‘ఈనాడు’లో గత నెల 27న ‘ఆడేదెలా.. అర్జునలొచ్చేదెలా..?’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పదిహేను రోజుల నుంచి క్రీడా మైదానంలో వసతులను సరిచేసే పనులు చేస్తున్నారు. ప్రధానంగా పాడైపోయిన క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్‌ స్థానంలో  కొత్తది ఏర్పాటు చేశారు.  బాస్కెట్‌బాల్‌ కోర్టును ఆధునికీకరించారు. వీటితోపాటు ఫుట్‌బాల్‌ కోర్టును చక్కదిద్దారు. వీటన్నింటినీ త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతో మైదానానికి వచ్చే క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆధునికీకరించిన బాస్కెట్‌బాల్‌ కోర్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని