logo

పోలీసులు తగిన మూల్యం చెల్లిస్తారు: ముప్పాళ్ల

ప్రభుత్వం ఎలా చెబితే అలా తలాడించేలా రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉందని ప్రముఖ న్యాయవాది, జీవో-1 రద్దు పోరాట ఐక్యవేదిక కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.

Published : 21 Mar 2023 05:18 IST

ముప్పాళ్లకు స్వాగతం పలుకుతున్న బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

దానవాయిపేట (రాజమహేంద్రవరం): ప్రభుత్వం ఎలా చెబితే అలా తలాడించేలా రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉందని ప్రముఖ న్యాయవాది, జీవో-1 రద్దు పోరాట ఐక్యవేదిక కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తనను అక్రమంగా నిర్బంధించారని, దీనికి నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశానన్నారు. దీనిపై విచారణను భోజన సమయం అనంతరం వింటామని న్యాయమూర్తి చెప్పడంతో పోలీసులు అదరాబాదరాగా వ్యక్తిగత పూచీకత్తుపై ఉదయం 11.13 గంటల సమయంలో తనను విడుదల చేశారన్నారు. ఆదివారం తనను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు కాపలా ఉన్నారని, అటువంటి సమయంలో అరెస్టు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం హరిస్తోందని  రాజమహేంద్రవరం బార్‌ అసోసియేషన్‌ నాయకులు పేర్కొన్నారు. ముప్పాళ్ల సుబ్బారావు అక్రమ అరెస్టును ఖండిస్తూ సోమవారం అసోసియేషన్‌ నాయకులు, సభ్యులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. సోమవారం ఉదయం విడుదలైన ముప్పాళ్లను పలువురు రాజానగరం స్టేషన్‌ నుంచి వాహన శ్రేణితో నగరంలోని బార్‌ కౌన్సిల్‌ కార్యాలయానికి తీసుకువచ్చి సన్మానించారు. మంగళవారం సైతం విధులు బహిష్కరిస్తున్నట్లు పలువురు న్యాయవాదులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని