logo

ఆశ.. నిరాశ..!

జిల్లా ఉన్నతాధికారులపై ఎన్నో ఆశలు పెట్టుకుని సోమవారం కలెక్టరేట్‌ స్పందనకు వచ్చిన అర్జీదారులకు నిరాశే ఎదురయ్యింది.

Published : 21 Mar 2023 05:37 IST

సమస్య తెలుసుకుంటున్న జేసీ ఇలక్కియ

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా ఉన్నతాధికారులపై ఎన్నో ఆశలు పెట్టుకుని సోమవారం కలెక్టరేట్‌ స్పందనకు వచ్చిన అర్జీదారులకు నిరాశే ఎదురయ్యింది. ఉదయాన్నే పదుల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడి వచ్చిన అర్జీదారులకు కలెక్టర్‌, జేసీ లేరని తెలియడంతో నిట్టూర్చారు. ఉదయం 10.30 దాటినా స్పందన ప్రారంభం కాకపోవడంతో వినతులతో వచ్చిన వేచి చూడాల్సి వచ్చింది. డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, సెజ్‌ ప్రత్యేక ఉప కలెక్టర్‌ కె.మనోరమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ కృతికాశుక్లా అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. జేసీ ఇలక్కియ  అర్ధగంటపాటు అర్జీలు స్వీకరించి, తన ఛాంబరుకు వెళ్లిపోయారు. ఉప కలెక్టర్లే మధ్యాహ్నం 1.30 గంటల వరకు వినతులు స్వీకరించారు. ఏకంగా 243 మంది వినతులు అందజేశారు. భూ సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, ఉపాధి కల్పించాలని, పింఛన్లు, ఇళ్ల పట్టాలు ఇప్పించాలని, అనేకసార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడంలేదని వినతులు అందజేశారు.  

ఫిర్యాదితో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

పోలీసు స్పందనకు 43 ఫిర్యాదులు

మసీదుసెంటర్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఫిర్యాదుదారుల నుంచి 43 అర్జీలు స్వీకరించారు. వీటిలో సివిల్‌ వివాదాలు - 16, కుటుంబతగాదాలు - 08, ఇతర సమస్యలు - 19 ఉన్నాయి. ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి.. వాటిపై సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులకు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ డీపీఆర్‌ స్వామి భోజన సదుపాయం కల్పించారు. ఏఎస్పీ పి.శ్రీనివాస్‌, డీఎస్పీలు అంబికాప్రసాద్‌, వెంకటేశ్వరరావు, మురళీమోహన్‌, పట్టణ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని