నా ఇంటిని వదిలి వెళ్లండి: జవహర్
‘నా ఇల్లు ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయం కాదు.. నా ఇంటి ముందు మీరు ఉండటం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగే చర్య.
జవహర్‌కు నోటీసులు అందిస్తున్న పోలీసులు
కొవ్వూరు పట్టణం (చాగల్లు), న్యూస్‌టుడే: ‘నా ఇల్లు ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయం కాదు.. నా ఇంటి ముందు మీరు ఉండటం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగే చర్య. వెంటనే వదిలి వెళ్లండి..’ అని మాజీ మంత్రి, తెదేపా నేత కె.ఎస్.జవహర్ పోలీసులను హెచ్చరించారు. సోమవారం తెల్లవారు జామున కొవ్వూరు పట్టణంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.1ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని భగ్నం చేసేలా ముందస్తు గృహనిర్బంధాలకు పాల్పడటం సరికాదన్నారు. హక్కులకు భంగం కలిగించే ఇటువంటి చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులపై వ్యక్తిగతంగా అట్రాసిటీ కేసులు పెడతానన్నారు. ప్రతిపక్ష నాయకులపై నిర్బంధం పెట్టడం దారుణమన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నామన్నారు. దీంతో పోలీసు సిబ్బంది సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: ఈనెల 11నుంచి అందుబాటులోకి హార్టీకల్చర్ హాల్‌టికెట్లు
-
India News
Rajnath Singh: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: రాజ్‌నాథ్ సింగ్
-
Movies News
Shah Rukh Khan: షారుఖ్ ఐకానిక్ పోజ్.. గిన్నిస్ రికార్డ్ వచ్చిందిలా
-
Crime News
Crime news: ఠాణే హత్య కేసు.. మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్‌లో సెర్చ్!
-
Politics News
Rahul Gandhi: గడ్డం పెంచుకుంటే ప్రధాని అయిపోరు: సామ్రాట్ చౌదరి