logo

‘సంపూర్ణ పోషణ’పై ప్రత్యేక దృష్టి

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు.

Published : 24 Mar 2023 04:36 IST

క్యాంపు కార్యాలయం నుంచి హాజరైన కలెక్టర్‌ కృతికాశుక్లా

కాకినాడ కలెక్టరేట్‌: వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ తన విడిది కార్యాలయం నుంచి అధికారులతో కలసి హాజరయ్యారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వైద్యం, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు, సచివాలయాలు, గడపగడపకు మన ప్రభుత్వం, స్పందన అర్జీలు, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాలు ద్వారా అందిస్తున్న పాలు, గుడ్లు, పౌష్టికాహారం గర్భిణులు, బాలింతలు, పిల్లలు తప్పనిసరిగా తినేలా చూడాలన్నారు.  సమావేశంలో డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, డీఎంహెచ్‌వో ఆర్‌.రమేశ్‌, డీసీహెచ్‌ఎస్‌ పీబీ విష్ణువర్థిని, ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ, డీఐవో ప్రభాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీఎల్‌డీవోలు ప్రసాదరావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని