logo

జడ్పీలో అంతుచిక్కని లెక్కలపై సమీక్ష

జిల్లా పరిషత్‌లో తేలని ఖర్చులపై జడ్పీ సీఈవో సత్యనారాయణ ఆడిట్‌ అధికారులు, జడ్పీ విభాగాల అధిపతులు, ఇంజినీరింగు అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Published : 26 Mar 2023 03:23 IST

‘ఈనాడు’ కథనంతో కదిలిన యంత్రాంగం

కాకినాడ నగరం: జిల్లా పరిషత్‌లో తేలని ఖర్చులపై జడ్పీ సీఈవో సత్యనారాయణ ఆడిట్‌ అధికారులు, జడ్పీ విభాగాల అధిపతులు, ఇంజినీరింగు అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ‘రూకలు పాయె.. లెక్కలు మాయె’ శీర్షికన శనివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, వివిధ విభాగాల అధిపతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆడిట్‌ అభ్యంతరాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. తక్షణం వాటిని పరిష్కరించుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ 1979 నుంచి ఆడిట్‌ అభ్యంతరాలు పేరుకుపోయాయన్నారు. అప్పటి నుంచి 2019-20 వరకు జడ్పీ పరిధిలో 1407 ఆడిట్‌ అభ్యంతరాలున్నాయన్నారు. వీటి విలువ రూ.15.97 కోట్లుగా పేర్కొన్నారు. 2020-21కి సంబంధించి 66 ఆడిట్‌ అభ్యంతరాలున్నాయని వెల్లడించారు. వీటి విలువ రూ. 10.89 కోట్లుగా వెల్లడించారు. ఆడిట్‌ అభ్యంతరాల్లో ఎక్కువ శాతం ఇంజినీరింగు విభాగానికి చెందినవేనన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిసరఫరా తదితర ఇంజినీరింగు విభాగాల అధికారులు జమా ఖర్చులకు సంబంధించిన వివరాలను ఆడిట్‌ అధికారులకు తెలపాల్సి ఉందన్నారు. వీటి పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని